ఈ విషయంలో తమ్ముడి దారిలో వెళ్తున్న అన్నయ్య..!!

-

మెగాస్టార్ చిరంజీవి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా సినిమా రంగంలో రాజకీయ రంగంలో రాణిస్తున్నారు. చిరంజీవి అడపాదడపా కనిపిస్తున్న గాని పవన్ కళ్యాణ్ మాత్రం రెగ్యులర్ పాలిటిక్స్ చేస్తూ ఇటీవల మళ్లీ సినిమాలు చేస్తున్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలకు చాలా సందర్భాలలో పవన్ కళ్యాణ్ వ్యతిరేకత చెప్పిన తరుణంలో చిరంజీవి సపోర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. టీడీపీతో తమ్ముడు కలవటం ఇష్టం లేకపోయినా చిరంజీవి అనేకసార్లు… తమ్ముడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసిన టిడిపి విధివిధానాలను చిరంజీవి బహిరంగంగా ఎండగట్టడం జరిగింది.

ఇలా అనేక సార్లు రాజకీయంగా పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా వ్యవహరించిన చిరంజీవి ఒక్క విషయంలో మాత్రం తన తమ్ముడి దారిలో వెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. మేటర్ లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ కెరియర్ పరంగా సరైన హిట్ లేక ఉన్న సందర్భంలో ‘గబ్బర్ సింగ్’ లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ తో సినిమా చేయడానికి చిరంజీవి రెడీ అయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.

 

ఈమధ్య హరీష్ శంకర్ మెగాస్టార్ చిరంజీవి తో చర్చలు జరిపినట్లు టాక్. మంచి కథతో వస్తే కచ్చితంగా ఛాన్స్ ఇస్తానని చిరు మాటిచ్చినట్లు తెలుస్తోంది. దీనితో  దర్శకుడు మెగా స్టోరీని సిద్ధం చేసే పనిలో పడ్డారట. మొత్తంమీద రాజకీయంగా విభేదించిన సినిమాపరంగా తన తమ్ముడికి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో చిరంజీవి పనిచేయటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version