బ్రేకింగ్‌: న‌టుడు వేణుమాధ‌వ్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం

-

ప్ర‌ముఖ సినీన‌టుడు, క‌మెడియ‌న్ వేణుమాధ‌వ్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. గ‌త నాలుగైదేళ్ల క్రిత‌మే ఆయ‌న తీవ్ర అనారోగ్యానికి గుర‌య్యారు. అప్ప‌టి నుంచి ఆయ‌న సినిమాల‌కు కూడా దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి తీవ్రంగా విష‌మించ‌డంతో ఆయ‌న్ను సికింద్రాబాద్‌లోని య‌శోదా హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించిన‌ట్టు తెలుస్తోంది. కాలేయం, కిడ్నీ సంబంధించిన సమస్యలకు చికిత్స తీసుకుంటున్నారు. కిడ్నీ సమస్య తీవ్రం కావడంతో హాస్పిటల్‌లో చేర్పించారు.

ఆరోగ్యం విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. కొన్నాళ్లుగా వేణుమాధవ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొన్నాళ్ల క్రితం ఆయన ఆరోగ్యం బాలేదని వచ్చిన వార్తలపై స్వయంగా స్పందించి పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని ప్రకటించారు. కొద్ది రోజులుగా కాలేయం సంబంధిత వ్యాధికి చికిత్స తీసుకుంటోన్న ఆయ‌న‌కు ఇప్పుడు కిడ్నీ స‌మ‌స్య కూడా తీవ్రం అయిన‌ట్టు తెలుస్తోంది.

వేణుమాధ‌వ్ ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు తెలియ‌డంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జీవిత రాజశేఖర్, నటుడు ఉత్తేజ్ హుటాహుటినా ఆస్పత్రికి చేరుకొని వేణుమాధవ్ ఆరోగ్యపరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు

Read more RELATED
Recommended to you

Exit mobile version