చిక్కుల్లో ప‌డిన ఆర్య

-

ఈ మ‌ధ్య న‌టీన‌టులు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుపోతున్నారు. ఈ క్ర‌మంలో కొంద‌రు అరెస్టు కూడా అయి జైలుపాల‌వుతున్నారు. మ‌రికొంద‌రు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంకొంద‌రు విచార‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. తాజాగా.. హీరో ఆర్య చిక్కుల్లో ప‌డ్డారు. అయితే.. ఇది దాదాపుగా తొమ్మిదేళ్ల క్రితం వ‌చ్చిన సినిమాకు సంబంధించిన వివాదం ఇప్పుడు విచార‌ణ‌కు వ‌చ్చింది. దీనికి సంబంధించి, ఆర్య‌కు అంబా సముద్రం కోర్టు నోటీసులు జారీ చేసింది. నిజానికి.. ఆర్య ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి వివాదాల్లోనూ చిక్కుకోలేదు. అలాంటి వాటికి చాలా దూరంగా ఉంటార‌నే టాక్ ఇండ‌స్ట్రీలో ఉంది. కానీ.. అనూహ్యంగా ఆయ‌న కోర్టు మెట్లు ఎక్కాల్సి వ‌స్తోంది.

9 ఏళ్ల క్రితం ఆర్య నటించిన అవన్‌ ఇవన్‌ చిత్రం ఆయన్ని ఇప్పుడు కోర్టుకు లాగుతోంది. బాల దర్శకత్వంలో విశాల్, ఆర్య కలిసి నటించిన చిత్రం అవన్‌ ఇవన్‌. ఈ చిత్రంలో సింగంపట్టి జమీన్‌ను అవమానపరిచే సన్నివేశాలు చోటుచేసుకున్నాయంటూ నెల్లై జిల్లా, అంబాసముద్రం కోర్టులో అప్పట్లో పిటిషన్‌ దాఖలైంది. అయితే.. ఆ పిటిషన్‌ కోర్టులో విచారణకు వచ్చింది. ఆర్య ఈ నెల 28న హాజరు కావాల్సిందిగా అంబాసముద్రం కోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఇది ఏ మ‌లుపులు తిరుగుతుందో చూడాలి మ‌రి.

Read more RELATED
Recommended to you

Exit mobile version