పుష్ప 2 నుంచి క్రేజీ అప్డేట్..!

-

పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాలలో పుష్ప 2 సినిమా కూడా ఒకటి. పుష్ప ది రూల్ గా వస్తున్న ఈ సినిమా నుంచి చాలా రోజులుగా ఎటువంటి అప్డేట్ రాలేదని చెప్పాలి. కానీ ఈ సినిమా నుంచి ఒక కొత్త అప్డేట్ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూలు త్వరలో హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో ప్రారంభం కానుందట. ముఖ్యంగా అల్లు అర్జున్ తో పాటు ఇతర కీలక నటులపై వచ్చే సన్నివేశాలను ఈ షెడ్యూల్లో షూట్ చేయబోతున్నట్లు సమాచారం.

పుష్ప సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా షేకావత్ సింగ్ గా కనిపించిన ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.ఇకపోతే రెండవ పార్ట్ లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉన్నట్లు సమాచారం. ఇకపోతే అల్లు అర్జున్ మధ్య వచ్చే నాలుగు యాక్షన్ సన్నివేశాలతో పాటు జగపతిబాబుతో వచ్చే యాక్షన్ సీన్ మరింత అద్భుతంగా ఉండబోతుందని తెలుస్తోంది.

ఇకపోతే ఈ అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ కి చెందిన ఒక టీం పర్యవేక్షణలో షూటింగ్ చేయబోతున్నారట. ఇక సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్ నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్లో రష్మిక జాయిన్ అవుతున్నట్లు రీసెంట్గా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇకపోతే మొదటి భాగంతో భారీ విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు రెండవ భాగంతో ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తారో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version