ఇండస్ట్రీ అంటే చిన్న మాట కాదు.. నాన్న పెద్ద డైరెక్టర్ అయినా కూడా అది చిన్న మాట అయితే కాదు.. అవకాశాలు తన్నుకు రావు. వరించే అదృష్టాలు కొన్నే ఉంటాయి. వాటికి కొనసాగింపుగానే ప్రయత్నాలు కూడా ఉండాలి.. అప్పుడే ఎంత పెద్ద వారయినా రాణించడం సులువు. కష్టాలను జయించడం ఇంకా సులువు.. ఇదే మాట కాస్త అటు ఇటుగా అయినా చెబుతున్నారు గ్రేట్ డైరెక్టర్ శంకర్ కుమార్త్ అదితీ శంకర్.
పాట వైవిధ్యం.. మాట వైవిధ్యం..ఓ విధంగా ఆయన సినిమా అంటేనే విభిన్నతల మరియు ప్రత్యేకతల కలబోత. కానీ నా పేరు నీవు ఎవ్వరికీ చెప్పకు నీ కష్టం నీ ప్రతిభ ఇవే నీకు ఆయుధాలు కావాలి అని చెప్పారు శంకర్ తన గారాలపట్టి అదితికి.. ఆ విధంగా చదువుకు (ఎంబీబీఎస్ ) కొనసాగింపు ఇస్తూనే ఆమె ఇటుగా వచ్చారు. ఇండస్ట్రీ లో రాణించాలన్న తపనను పెంచుకున్నారు. చిన్ననాట నుంచి గాన సాధనపై మక్కువ పెంచుకున్న ఆ అమ్మాయి మన తెలుగు పాటతో ప్రేక్షకులను ఉర్రూతలుగించారు.ఆ విధంగా ఆ నట గాయని ఇప్పుడొక గుర్తింపులో ఉన్న స్వరం. గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాట పడుతున్న ముఖం..ఆ విధంగా స్వరముఖి అదితి అని రాయాలి. ఆమె కృషికి త్వరలోనే మంచి గుర్తింపు దక్కాలని ఆశిద్దాం.
వైద్యం తెలిసిన అమ్మాయి.. రాత్రిళ్లు చదువుకు కేటాయించి శ్రమించి కలలకు రూపం ఇచ్చిన అమ్మాయి. అందరికీ తెలిసిన అమ్మాయి కానీ ఎవ్వరూ ఆమెను గుర్తు పట్టలేరు.. ఇప్పటిదాకా ! తన తండ్రి శంకర్ ఓ పెద్ద డైరెక్టర్ అని చెప్పుకోవడం కన్నా తానొక మంచి నటి అని నిరూపించుకోవడమే ఇప్పటి ప్రాధాన్యం ఆమెకు. వైద్యం తెలిసిన అమ్మాయి కనుక పేదలకు సాయం అందించడం తన బాధ్యత అని అంటున్నారు. ఎన్నో కష్టాలు దాటుకుని చదివిన చదువుకు సార్థకం అప్పుడే అని నిర్ణయించారు ఆమె.. నిర్థారించారు ఆమె.. ఆ విధంగా త్వరలో వైద్య శిబిరాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నానని చెబుతున్నారామె !
మంచి పాట మాత్రమే కలతలను దూరం చేస్తుంది. మంచి స్వరం మాత్రమే హాయికి చిరునామా అయి నిలుస్తుంది. పాట ఏమయినా కూడా ఆఖరి వరకూ తోడు ఉంటుంది. జీవితేచ్ఛను సుసంపన్నం చేస్తుంది. పాట ఏదయినా కూడా జీవితాన్ని మారుస్తుంది. జీవితేచ్ఛను మరింత విస్తృతం చేస్తుంది. ఆ విధంగా ఇప్పటిదాకా పాటలు అన్నీ మేలు చేశాయి. డైరెక్టర్ శంకర్ సినిమా పాటలు అన్నీ మేలు చేశాయి. ఏ ఆర్ రెహ్మాన్ అనే యువ సంచలనం పాటలు ఆ రోజుల్లో మేలు చేశాయి.
ఇప్పుడు కాలం మారింది కదా! కనుక స్వరం ఏమయినా చెడు చేస్తుందా అంటే ఏం చెప్పగలం.. ఎన్ని కాలాలు మారినా కోయిల చేసే మేలు ఎన్నటికీ మారిపోదు. కోయిలమ్మ లాంటి అదితీ శంకర్ (డైరెక్టర్ శంకర్) పాట నిశ్చల స్వర జగతిని ఇంకా చెప్పాలంటే అఖిల జగతిని ప్రభావితం చేయకుండా ఉండిపోదు. కనుక గని సినిమా కోసం అదితీ శంకర్ పాడిన పాటకు మంచి మార్కులు దక్కాయి. స్వర సంచలనం అయిన తమన్ ఈ పాటను పాడే అవకాశం తనకు ఇచ్చారని, అనూహ్యంగా దక్కిన వరం ఇది అని అంటున్నారామె. రోమియోకి జూలియట్ లా.. రేడియోకి శాటి లైట్ లా అన్న పాట ఒకటి పాడి, ఇప్పుడు తనని తాను నిరూపించుకున్నారు. ఇకపై నటన, గానం రెండూ కొనసాగించడంలో తన ఇష్టం దాగి ఉందని చెప్పకనే చెబుతున్నారు. ఇప్పటికే విరుమన్ సినిమాకు సంబంధించి తళుకులీనారామె ! ఓ గ్రామీణ యువతి పాత్రలో మధురైకు చెందిన తమిళ యాసలో ఆకట్టుకున్నారామె ! ఈ సినిమాలో హీరో కార్తీ.. తొలుత అదితీ శంకర్ పేరు వినగానే నప్పుతుందో లేదో అని అనుకున్నారు కానీ తరువాత మాత్రం ఆమె ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసి తండ్రికి తగ్గ తనయ అని అనిపించుకున్నారు. ప్రశంసలు అందుకున్నారు.