Dhamaka : రవితేజ ‘ధమాకా’లోని డిలీటెడ్ సీన్స్ చూశారా..?

-

మాస్​మహారాజ రవితేజ నటించిన సినిమా ధమాకా. త్రినాథ్​రావు నక్కిన దర్శకత్వంలో శ్రీలీల హీరోయిన్​గా నటించిన ఈ సినిమా గతేడాది డిసెంబర్​లో విడుదలైంది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధించి రవితేజను వంద కోట్ల క్లబ్​లో చేర్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి డిలీటెడ్ సీన్స్​ను చిత్రబృందం విడుదల చేసింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా క్లీన్​గా ఉన్న ఈ సీన్స్​ను మీరూ ఓ సారి చూసేయండి.. జాలీగా ఎంజాయ్ చేయండి.

ధమాకా స్టోరీ ఏంటంటే..? పీపుల్ మార్ట్ అధిప‌తి అయిన చ‌క్ర‌వ‌ర్తి (స‌చిన్ ఖేడేక‌ర్‌) త‌న‌యుడు ఆనంద్ చ‌క్ర‌వ‌ర్తి (ర‌వితేజ‌). చ‌క్ర‌వ‌ర్తి మ‌రో రెండు నెల‌ల్లో చ‌నిపోతున్నాడ‌ని తెలుసుకున్న ‘జేపీ ఆర్బిట్’ అధిప‌తి జేపీ (జ‌య‌రాం) పీపుల్ మార్ట్ కంపెనీని హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌నుకుంటాడు. అందుకు అడ్డుగా ఉన్న ఆనంద్‌ని అంతం చేయాల‌నుకుంటాడు. జేపీలాంటి వ్య‌క్తుల‌కి బుద్ధి చెప్ప‌డానికి స్వామి (ర‌వితేజ‌)నే స‌రైనోడని భావించిన చ‌క్ర‌వ‌ర్తి అతణ్ని రంగంలోకి దింపుతాడు. ఇంత‌కీ స్వామి ఎవ‌రు? అత‌నికీ చ‌క్ర‌వ‌ర్తికీ సంబంధం ఏమిటి? స్వామి, ఆనంద్ ఒకలా ఉండ‌టానికి కార‌ణం ఏమిటి? ఇద్ద‌రూ ఒక్క‌రే అనుకుని ఇద్ద‌రినీ ప్రేమించిన ప్ర‌ణ‌వి (శ్రీలీల‌) ఎలాంటి పాట్లు పడిందనేది మిగ‌తా క‌థ‌

Read more RELATED
Recommended to you

Exit mobile version