విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ సినిమా ఈరోజు విడుదల అయ్యింది. అటు చిత్ర యూనిట్ ఇటు ప్రేక్షకులు సినిమాపై ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. మోహన్ బాబు నిర్మించారు. ఈ సినిమాలో మోహన్ లాల్, అక్షయ్ కుమార్, రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున రిలీజ్ చేసారు. మూవీ ప్రీమియర్స్ నుంచి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. హీరోయిన్ ప్రీతి ముకుందన్ ఛాలెంజింగ్ రోల్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు.
కన్నప్పలో తమిళ నటుడు శరత్ కుమార్ నాథనాధుడి పాత్రలో ఆయన గంబీరమైన వాయిస్ తో అదరగొట్టేసాడు. ఇక మోహన్ బాబు డైలాగ్ డెలివరీ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనే లేదు. అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో మోహన్ బాబు మహాదేవ శాస్త్రిగా నటించి అందరినీ ఫిదా చేసేసారు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ ఎప్పటిలానే జీవించేసారు. ఈ సినిమాలో కీలకమైన 40 నిముషాలను ప్రభాస్ నిలబెట్టేసాడు.
ప్రభాస్ డైలాగ్స్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. ప్రభాస్ పెళ్లి డైలాగ్ కి మాములుగా లేదు ఆడియన్స్ రియాక్షన్. ఇక క్లైమాక్స్ లో మంచు విష్ణు నటన కూడా నెక్స్ట్ లెవెల్ లో వుంది. శివయ్యకు కన్ను దానం చేసే సీన్ ఫెబ్యులస్ అసలు. విష్ణు మాత్రం ప్రేక్షకులను ఏడిపించేసాడు. పాటలతో పాటు నేపధ్య సంగీతం కూడా అదిరిపోయింది.