గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు వచ్చి ఇద్దరు మృతి…రూ.5 లక్షల సాయం ప్రకటన

-

గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు వచ్చి ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు వచ్చి తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరి యువకుల కుటుంబానికి చెరో రూ.5 లక్షల సాయం ప్రకటించారు దిల్ రాజు.  రాజమండ్రిలో శనివారం జరిగిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కాకినాడకు చెందిన అరవపల్లి మణికంఠ, తోకాడ చరణ్‌ అనే ఇద్దరు యువకులు వెళ్లారు.

Dil Raju announced an aid of Rs 5 lakh each to the families of the two youths who died in a road accident while coming back from the Game Changer event

అయితే.. ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఫంక్షన్ ముగిసిన అనంతరం కాకినాడ వైపు వస్తుండగా కార్గిల్ ఫ్యాక్టరీ వద్ద వ్యాను బలంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కాకినాడకు చెందిన అరవపల్లి మణికంఠ, తోకాడ చరణ్‌కు బలమైన గాయాలు అయ్యాయి. మణికంఠ అక్కడికక్కడే చనిపోగా.. చరణ్ కాకినాడ జీజీహెచ్ తీసుకొస్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతి చెందాడు. అయితే.. ఆ కుటుంబాలకు దిల్‌ రాజు అండగా నిలిచారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version