బంజారాహిల్స్ ఏసిబి కార్యాలయం ఎదుట రసాభాసగా మారింది పరిస్థితి. ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన లాయర్లతో ఏసీబీ ఆఫీసుకు వెళ్లారు. అయితే, లాయర్లు ఎవరూ కూడా కేటీఆర్ వెంట వెళ్ళకూడదన పోలీసులు నిలిపివేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆఫీస్ ఎదుట మీడియాతో మాట్లాడుతూ.. ‘చట్ట ప్రకారం ప్రతి పౌరుడికి ఉన్నతన హక్కులను వినియోగించుకోనివ్వాలని కోరారు.
ఫార్ములా – ఈ కేసు తీర్పు హైకోర్టు రిజర్వ్ చేసింది.. ఈ సమయంలో నన్ను విచారణకు పిలవాల్సిన అవసరం లేదు.కానీ రాజ్యాంగం మీద, న్యాయ వ్యవస్థ మీద నాకు గౌరవం ఉంది. లాయర్ సమక్షంలో విచారణ జరుపుతారు.కానీ, నా తరఫు లాయర్లను అడ్డుకుంటున్నారు.తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. ఫార్ములా – ఈ వ్యవహారంలో మంత్రిగా నిర్ణయం తీసుకున్నా.. ఆ సమాచారం అంత ఏసీబీ దగ్గరే ఉంది.ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు’ అని పేర్కొన్నారు. ఏసీబీ ఆఫీస్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కేటీఆర తన లాయర్లతో కలిసి వెనుదిరిగారు. అరగంట వేచి చూసి తెలంగాణ భవన్‌కు వెళ్లిపోయారు.