సంక్రాంతి బరిలో నుంచి ఎవరైనా తప్పుకుంటే మంచిది.. దిల్ రాజ్ కామెంట్స్

-

టాలీవుడ్లో సంక్రాంతి సందడే వేరు. ఈ పండుగకు దాదాపు పెద్ద హీరోల సినిమాలే వస్తాయి. వారి ధాటికి తట్టుకోగలుగుతాం అనుకున్న వారే తమ సినిమాలు రిలీజ్ చేస్తారు. అయితే 2024 సంక్రాంతికి టాలీవుడ్ బాక్సీఫీస్ వద్ద తీవ్ర పోటీ నెలకొననుంది. ఎప్పుడూ లేని విధంగా ఏకంగా ఐదు పెద్ద సినిమాలు రిలీజ్కు రెడీగా ఉన్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘గుంటూరు కారం’, విక్టరీ వెంకటేశ్ ‘సైంధవ్’, రవితేజ ‘ఈగల్’, తేజ సజ్జ ‘హనుమాన్’, నాగార్జున అక్కినేని ‘నా సామిరంగా’ మూవీస్ సంక్రాంతి బరిలో నిలిచాయి. ఈ క్రమంలో సంక్రాంతి పోటీపై ప్రముఖ నిర్మాత ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్రాజు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల ప్రొడ్యూసర్లతో ఛాంబర్లో మీటింగ్ నిర్వహించినట్లు దిల్ రాజ్ చెప్పారు. ఐదు సినిమాలు సంక్రాంతి బరిలో ఉండడం వల్ల థియేటర్లు అడ్జస్ట్ అవ్వడం కష్టమని, అన్ని సినిమాలు ఒకేసారి వస్తే ఎవరికీ సరైన న్యాయం జరగదన్న విషయాన్ని నిర్మాతల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. గుంటూరు కారం ఇదివరకే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన కారణంగా ఆ సినిమా జనవరి 12న రిలీజ్ అవుతుందని.. మిగిలిన వాళ్లలో ఎవరైనా సంక్రాంతి పోటీ నుంచి డ్రాప్ అయితే, వాళ్లకు కచ్చితంగా ఛాంబర్ నుంచి సోలో రిలీజ్ డేట్ ఇప్పిస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version