పారెన్ కి శ్రీతేజ్.. నిర్మాత బన్నీ వాసు సంచలన నిర్ణయం

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  నటించిన ‘పుష్పా -2 సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్  వద్ద జరిగిన తొక్కిసలాటలో బాలుడు శ్రీతేజ్  తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం శ్రీతేజ్ నగరంలోని కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. క్రమ క్రమంగా కోలుకోవడంతో చిన్నారిని పలువురు పరామర్శిస్తున్నారు. ఇప్పటికే దిల్ రాజు తో పాటు అల్లు అరవింద్ పరామర్శించారు. తాజాగా నిర్మాత బన్నీ వాస్  కిమ్స్ కి వెళ్లారు. చిన్నారి శ్రీతేజ్ను పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్యం కుదుటపడటంతో సంతోషం వ్యక్తం చేశారు. శ్రీతేజ్ కి ఇంకా మెరుగైన వైద్యం
అందించడానికి ఫారెన్ తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు బన్నీ వాస్ తెలిపారు.

డిసెంబర్ 04న రాత్రి పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళా మరణించిన విషయం తెలిసిందే. చిన్నారి శ్రీతేజ్ కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు శ్రీ తేజ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version