మరోసారి తండ్రి కాబోతున్న నిర్మాత దిల్ రాజు ?

-

తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నిర్మాత దిల్ రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ స్థాపించి అందులో సినిమాలు నిర్మించాడు దిల్ రాజు. చాలా చిన్న వయసులోనే నిర్మాతగా మారిన ఈయన ఇప్పటికే 30 సినిమాలు మైలు రాయిని కూడా అందుకున్నాడు. అయితే సినీ నిర్మాత దిల్ రాజు మళ్లీ తండ్రి కాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ఇప్పటికే తాతయ్య. దిల్‌ రాజు మొదటి భార్యకు ఒక కుమార్తె ఉంది, ఆమె ఇప్పటికే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అంటే ఈ లెక్కన ప్రస్తుతం దిల్‌ రాజు తాతయ్య అన్న మాట.

అయితే.. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం దిల్ రాజు రెండవ భార్య ప్రస్తుతం గర్భవతి అని తెలుస్తోంది. త్వరలో ఆమె ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంది. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, దిల్ రాజు కుటుంబం, సన్నిహితులు మరియు ప్రియమైనవారు ఈ సారి..ఆయనకు మగబిడ్డ పుట్టాలని ఆశిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version