వేణుస్వామితో ప్రత్యేక పూజలు చేయిస్తున్న డింపుల్ హయతి..ఫొటోస్ వైరల్!

-

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్ల చేత ప్రత్యేక పూజలు నిర్వహించి వారి కెరియర్ ను మార్చిన విషయం తెలిసిందే. అలాంటి వారిలో నేషనల్ క్రష్ రష్మిక తో పాటు నిధి అగర్వాల్ కూడా ఉన్నారు. వీరిద్దరూ కూడా తమ కెరియర్ కోసం వేణు స్వామి చేత ప్రత్యేక పూజలు నిర్వహించి ఇప్పుడు తమ కెరియర్ను ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అటు నిధి అగర్వాల్ కూడా వరుసగా అవకాశాలు అందుకుంటూ తన సినీ కెరియర్ లో బిజీగా మారిపోయింది.

ఇదిలా ఉండగా తాజాగా ఇప్పుడు వీరిద్దరి బాటలో ప్రముఖ హీరోయిన్ డింపుల్ హయతి కూడా నడుస్తోందని చెప్పవచ్చు. అందం, అభినయంతో పాటు అంతకుమించి డాన్స్ స్కిల్స్ ఉన్న ఈ ముద్దుగుమ్మకు సినిమాలలో మాత్రం అవకాశాలు లభించడం లేదు. గద్దలకొండ గణేష్ అనే చిత్రం ద్వారా స్పెషల్ సాంగ్ చేసి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. గత ఏడాది వచ్చిన ఖిలాడీ సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ లభించలేదు. మరొకవైపు పోలీస్ అధికారితో గొడవలు అన్నీ కూడా ఆమె కెరియర్ ను మరింత దిగజార్చేలా చేశాయి.

ఈ నేపథ్యంలోనే డింపుల్ హయతి వేణు స్వామిని సంప్రదించగా ఆమె జాతకంలో కొన్ని దోషాలు ఉన్నాయని.. పూజలు నిర్వహిస్తే సక్రమంగా కెరియర్ ముందుకు సాగుతుందని ఆయన సూచించినట్లు సమాచారం. అందుకే డింపుల్ హయతి వేణు స్వామి చేత ప్రత్యేక పూజలు నిర్వహిస్తోందని.. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే వేణు స్వామి పూజలు చేయిస్తున్న నేపథ్యంలో ఈమె కెరియర్ మళ్ళీ పుంజుకుంటుందా లేదా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు అభిమానులలో వ్యక్తం అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version