భర్త ఆస్తిలో భార్యకు సమాన వాటా.. మద్రాసు హైకోర్టు కీలక తీర్పు

-

భర్త డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తిలో భార్యకూ సమాన వాటా ఉంటుందని మద్రాసు హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఓ గృహిణిగా ఆమె కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం వల్లే ఇంటి బెంగ లేకుండా భర్త స్వేచ్ఛగా, ఒత్తిడి లేకుండా సంతృప్తికరంగా బయట పనిచేయడానికి వీలవుతోందని, తద్వారా ఆస్తులు సంపాదన జరుగుతోందని పేర్కొంది. ఈ తీర్పును ఈ నెల 21న జస్టిస్‌ కృష్ణన్‌ రామసామి వెలువరించారు.

‘‘కుటుంబ ఆస్తులు భర్త సంపాదించడం వెనుక భార్య పరోక్ష భాగస్వామ్యం ఉంది. ఈ విషయాన్ని ఈ న్యాయస్థానం గుర్తిస్తోంది. దశాబ్దాల పాటు కుటుంబాన్ని, పిల్లలను భార్య ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. చివరకు ఆమెకు తన సొంతమని చెప్పుకోవడానికి ఏమీ మిగలదు. కుటుంబ సంక్షేమం కోసం ఆస్తుల సంపాదనలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భార్యాభర్తలిద్దరి భాగస్వామ్యం ఉంటుంది. ఇద్దరికీ ఇందులో సమాన వాటా ఉంటుంది’’ అని ఉత్తర్వుల్లో జస్టిస్‌ రామసామి స్పష్టం చేస్తూ.. మరణించిన తన భర్త పేరిట ఉన్న ఆస్తుల్లో సమాన వాటా ఇవ్వాలని కోరుతూ అమ్మాల్‌ అనే గృహిణి దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version