బింబిసార సినిమా మొదటి రోజే ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా..?

-

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం బింబిసారా.. ఈ సినిమా నిన్నటి రోజున విడుదలై మంచి టాక్ తో దూసుకుపోతోంది. చిత్రంతో కళ్యాణ్ రామ్ మరొకసారి తన స్టామినా ఏంటో చూపించారని చెప్పవచ్చు. అయితే కళ్యాణ్ రామ్ కెరియర్ లో ఎన్ని ఫ్లాపులు వచ్చినా కూడా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా వరుస సినిమాలతో దూసుకుపోతూ ఉన్నారు. ఇక అలా ఎన్నో ఫ్లాప్ ల తర్వాత ఇప్పుడు బింబిసారా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు కళ్యాణ్ రామ్. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా మొదటిరోజు ఎంతటి కలెక్షన్లను చేసిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బింబిసారా చిత్రాన్ని డైరెక్టర్ మల్లిడి వశిష్ట ఎంత అద్భుతంగా తెరకెక్కించారు. ఏ సినిమా టైం ట్రావెల్ కథ అంశంతో తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాలో హీరోయిన్లుగా కేథరిన్, సంయుక్త మీనన్ నటించారు. కీలకమైన పాత్రలలో ప్రకాష్ రాజ్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్ వంటి వారు నటించారు

1)..బింబిసారా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.13.50 కోట్ల రూపాయలు బిజినెస్ చేసుకుంది.

2). రెస్టాఫ్ ఇండియాలో-1.10 కోట్ల రూపాయలు బిజినెస్ చేసుకుంది.

3). ఓవర్సీస్ లో కోటి రూపాయల వరకు బిజినెస్ చేస్తుంది.

ఇక ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా రూ.15.60 కోట్ల మేరకు బిజినెస్ జరిగింది. ఇక మొదటి రోజు కలెక్షన్లు విషయానికి వస్తే.. ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో కలెక్షన్ల విషయానికి వస్తే..

1). నైజాం-2.15 కోట్ల రూపాయలు.
2). సి డెడ్-1.29 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-90 లక్షలు.
4). ఈస్ట్ గోదావరి-43 లక్షలు.
5). వెస్ట్ గోదావరి-36 లక్షలు.
6). గుంటూరు-57 లక్షలు.
7). కృష్ణ-34 లక్షలు.
8). నెల్లూరు-26 లక్షలు.
9). మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలలో కలుపుకొని రూ.6.30 కోట్ల రూపాయల షేర్ తో పాటు రూ.9.30 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది.
10). ఇక కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ వీటితో కలుపుకుంటే ప్రపంచవ్యాప్తంగా రూ.11.5 కోట్ల రూపాయలకు గ్రాస్ పైగా వచ్చినట్లు సమాచారం. ఈ సినిమా మొదటి రోజు 50 శాతం వరకు వసూలు చేసినట్లుగా సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version