సినీ నటుడు ఫిష్ వెంకట్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇతను గత రెండు రోజుల క్రితం అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు. అయితే ఫిష్ వెంకట్ దాదాపు 100కు పైగా సినిమాలలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఎన్నో సినిమాలలో నటించిన ఫిష్ వెంకట్ పెద్దగా ఆస్తులను కూడబెట్టలేదు. తనకు తోచినంతగా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉండేవాడు.

కాగా, ఫిష్ వెంకట్ ఒక్కో సినిమాలో నటించినందుకు కేవలం రూ. 30 వేల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకునేవారట. తన కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో కూడా అతి తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినప్పటికీ సినిమాలలో నటించేవాడని సమాచారం అందుతోంది. కాగా, ఫిష్ వెంకట్ గత కొన్ని రోజుల క్రితమే షుగర్ సమస్యతో బాధపడ్డాడు. అంతేకాకుండా కిడ్నీ పూర్తిగా పాడవడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఆరోగ్యం మెరుగుపడి మళ్లీ సినిమాలలో నటిస్తానని అనుకునే లోపే మరోసారి ఆరోగ్యం క్షీణించి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఫిష్ వెంకట్ మరణంతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.