మాప్తో ఆలయ ప్రాంగణాన్ని ఊడ్చిన సీఎం చంద్రబాబు నాయుడు… అక్కడే ఉన్న సిబ్బంది సమస్యలు తెలుసుకున్నారు. ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ మేరకు తిరుపతిలో పర్యటించారు ఏపీ సీఎం చంద్రబాబు. పరేడ్ మైదానంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర స్టాళ్లను పరిశీలించిన చంద్రబాబు.

రేణిగుంట మండలం తూకివాకంలో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను సందర్శించారు చంద్రబాబు. ఈ సందర్బంగా స్వయంగా ఆలయ ప్రాంగణాన్ని తుడిచారు సీఎం చంద్రబాబు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచారు చంద్రబాబు నాయుడు. నిన్న తిరుపతిలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’లో భాగంగా చోటుచేసుకున్న దృశ్యం ఇప్పుడు వైరల్ గా మారింది.
మాప్తో ఆలయ ప్రాంగణాన్ని ఊడ్చిన సీఎం చంద్రబాబు pic.twitter.com/6JcE5LxoFz
— Telugu Scribe (@TeluguScribe) July 20, 2025