వరుణ్ తేజ్ – లావణ్య ల పెళ్లి కార్డు కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా..?

-

గత కొద్దిరోజులుగా మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమిస్తున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఈ విషయంపై ఎవరూ స్పందించలేదు. ఇక గత వారం రోజులుగా వీరిద్దరి పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారని, రాజస్థాన్లోని ఉదయ్ గడ్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరగబోతోంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.అంతేకాదు వీరిద్దరికీ ఈరోజు నిశ్చితార్థం జరగబోతుందని అందుకు సంబంధించిన ఒక ఇన్విటేషన్ కార్డు కూడా నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉంది అనే విషయంపై మెగా ఫ్యామిలీ ఏ మాత్రం స్పందించలేదు.

ఇప్పుడు తాజాగా మరొక వార్త నెట్టెంట తెగ హాట్ టాపిక్ గా మారింది. కేవలం వెడ్డింగ్ కార్డు కోసమే వీరు 80 వేల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. వెడ్డింగ్ కార్డుని బంగారు పూతతో కోటింగ్ చేయిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇకపోతే అంత డబ్బు కేవలం ఒక వెడ్డింగ్ కార్డు కోసమే వీరు ఖర్చు చేస్తున్నారు అంటే ఇక పెళ్లి కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి అయితే తన చెల్లి నిహారిక పెళ్లిని రాజస్థాన్లోని ఉదయ్ గడ్ ప్యాలెస్ లో జరిపించారు కాబట్టి ఇక వీరి పెళ్లి కూడా అక్కడే జరగబోతుందని అంగరంగ వైభవంగా వీరి వివాహాన్ని కుటుంబ సభ్యులు చేయబోతున్నారని తెలుస్తోంది.

ఇకపోతే వరుణ్ తేజ్ విషయానికి వస్తే.. హీరోగా స్థిరపడిపోయిన వరుణ్ తేజ్ భారీ పాపులారిటీని దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు పదికోట్ల రూపాయల వరకు పారితోషకం తీసుకుంటున్న ఈయన త్వరలోనే పెళ్లి పీటలెక్కపోతున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version