ఆమెను చూడగానే గుక్కపెట్టి ఏడ్చిన హీరో సిద్ధార్థ్‌.. వీడియో వైరల్

-

హీరో సిద్ధార్థ్ చాలా కాలం తర్వాత తెలుగులో మరో సినిమా చేస్తున్నారు. అదే టక్కర్ చిత్రం. ఇవాళ ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రమోషన్స్​లో సిద్ధార్థ్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్​లో భాగంగా ఓ ఛానెల్​కు ఇంటర్వ్యూ ఇస్తుండగా.. అక్కడికి వచ్చిన గెస్టును చూసి సిద్ధార్థ్ గుక్కపెట్టి ఏడ్చాడు. ఇంతకీ ఆమె ఎవరు.. సిద్ధూ ఎందుకు ఏడ్చాడంటే..?

టక్కర్ మూవీ ప్రమోషన్స్​లో ఉన్న సిద్ధార్థ్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తూ సుజాత రంగరాజన్‌ స్టేజ్‌పైకి వచ్చారు. ఆమెను చూసిన వెంటనే సిద్ధార్థ్‌ భావోద్వేగానికి గురయ్యాడు. ఒక్కసారిగా ఆమె కాళ్లకు నమస్కరించి.. ఆమెను హత్తుకుని ఏడ్చేశాడు. ‘ఈవిడ పేరు సుజాత. నన్ను బాయ్స్‌ సినిమాలో హీరోగా తీసుకోవాలని దర్శకుడు శంకర్‌ను కోరకపోతే.. నా జీవితం ఈరోజు వేరేలా ఉండేది. ఈమె వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను’’ అని చెప్పాడు.

ఇక సుజాత రంగరాజన్‌ మాట్లాడుతూ..‘‘సిద్ధార్థ్‌ మొదటి నుంచి దర్శకుడు కావాలని కలలు కన్నాడు. ‘బాయ్స్‌’ సినిమాలో హీరో కోసం ఆడిషన్స్‌ జరుగుతుంటే నేను సిద్ధార్థ్‌ను తీసుకోవాల్సిందిగా దర్శకుడు శంకర్‌ని కోరాను. సిద్ధార్థ్ వెళ్లడానికి అంగీకరించలేదు. నేనే బలవంతంగా ఒప్పించి పంపా. శంకర్‌ ఫోన్‌ చేసి ఒకసారి వచ్చి ఫొటో షూట్‌ చేసి వెళ్లమనడంతో.. ఇష్టం లేకుండానే వెళ్లాడు. వాళ్లు తనని చూసిన వెంటనే ఆ సినిమాలో హీరోగా ఓకే చేశారు’’ అని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version