కోవై సరళ హీరోయిన్ గా కమలహాసన్ సరసన నటించిన సినిమా ఏంటో తెలుసా..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేర్లు ఆలీ, బ్రహ్మానందం లాంటివారే.. కానీ గత కొన్ని సంవత్సరాలుగా తన కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తూ కమెడియన్స్ కి పోటీ ఇచ్చిన ఫిమేల్ కమెడియన్ కోవై సరళ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె ఎక్కువగా బ్రహ్మానందంతోనే కలిసి కామెడీ పండించేవారు. ఇక వీరిద్దరూ కలిసి సినిమాలో నటిస్తున్నారు అంటే ఆ సినిమాలో కామెడీకి కొదవ ఉండదు అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా సినీ ప్రేక్షకులు కూడా వీరిద్దరూ కలిసి నటిస్తే.. ఆ సినిమాలో చూడాలని తెగ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ జంట తెలుగు తెరపై సూపర్ హిట్ జోడిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

అప్పట్లో రమాప్రభ , రాజబాబు జంట తర్వాత అంత గుర్తింపు తెచ్చుకుంది బ్రహ్మానందం, కోవై సరళ జంట మాత్రమే. ముఖ్యంగా బ్రహ్మానందంతో పోటీపడి మరీ కోవై సరళ తెరపై నవ్వులు పూయించేవారు. ఇప్పటికీ క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమా చూస్తూ ఉంటే వీరి కామెడీ టైమింగ్స్ కి కడుపుబ్బా నవ్వాల్సిందే. కొన్ని వందల సినిమాలలో కలిసి నటించిన వీరు దాదాపు అన్ని సినిమాలు మంచి విజయం సాధించాయి. ఆ తర్వాత కాలంలో వీరిద్దరూ తమ కెరియర్ ను విడివిడిగా కొనసాగించి.. ప్రస్తుతం ఇండస్ట్రీలో కనిపించడం లేదు. లేడీ కమెడియన్ గా మాత్రమే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కోవై సరళ హీరోయిన్గా కూడా నటించింది అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అని చెప్పాలి.

ఒక మలయాళీ కుటుంబంలో కోయంబత్తూర్ లో జన్మించిన కోవై సరళ కు చిన్ననాటి నుంచి నటన అంటే విపరీతమైన ఇష్టం. తమిళ్ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎంజీఆర్ అంటే ప్రాణం అనే చెప్పాలి. దాంతో చదువు మధ్యలోనే ఆపేసి వెళ్లి రథం అనే సినిమాలో మొదటిసారి నటించింది. ఇక ఆ తర్వాత భాగ్యరాజా సినిమా అయిన చిన్న వీడు చిత్రంలో కూడా నటించింది. ఈ సినిమాలో భాగ్యరాజాకు తల్లిగా నటించింది. ఇక తన నటన గుర్తించిన కమలహాసన్ ఆమెకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఇక కమలహాసన్ సినిమా అయినా సతీ లీలావతి చిత్రంలో కమలహాసన్ సరసన హీరోయిన్గా నటించడానికి తీసుకున్నారు. ఇక 1993లో రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది ఈ సినిమా.

Read more RELATED
Recommended to you

Exit mobile version