‘షంషేరా’లో..రణ్‌బీర్, సంజయ్ దత్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవాల్సిందే..

-

బాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ ‘షంషేరా’ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. వచ్చే నెల 22న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను మేకర్స్ స్టార్ట్ చేశారు. రణ్ బీర్ కపూర్ వెరీ డిఫరెంట్ అవతార్ .లో ఈ సినిమాలో కనిపించబోతున్నారు.

ఇప్పటి వరకు రొమాంటిక్ , లవర్ బాయ్ గా కనిపించిన రణ్ బీర్..ఈ పిక్చర్ లో యోధుడిగా కనిపించబోతున్నారు. 1870ల నేపథ్యంలో ఈ ఫిల్మ్ స్టోరి ఉండబోతున్నది. యశ్‌రాజ్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ ఫిల్మ్ కు కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో విడుదల చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో నటించినందుకు నటులు రణ్ బీర్, సంజయ్ దత్ లకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చినట్లు బాలీవుడ్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్. రణ్‌బీర్ ఏకంగా రూ.20కోట్లను తీసుకోగా, సంజు బాబా రూ. 8కోట్లను పారితోషికంగా అందుకున్నారట. మూవీలో కీ రోల్ ప్లే చేసిన రోనిత్ రాయ్ రూ. 4 కోట్లను తీసుకున్నారని వార్తలొస్తున్నాయి. మొత్తంగా ఈ ఏ డాది రణ్ బీర్ కపూర్ దేనని చెప్పొచ్చు. ఈ ఏడాది ఆయన నటించిన బిగ్ మూవీస్ ‘బ్రహ్మాస్త్ర’, ‘షంషేరా’ విడుదల కాబోతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version