టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు

-

టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు.ఎమ్మెల్సీ అనంత బాబు తమ కొడుకు ను అన్యాయంగా చంపేశారని చంద్రబాబు వద్ద కన్నీరు పెట్టుకున్నారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు సత్యనారాయణ, నూకరత్నం. మా కుమారుడి హత్య కేసులో పోలీసులు ద్వారా మాకు న్యాయం జరగడం లేదని అన్నారు.ముద్దాయి అనంత బాబుని కేసు నుంచి తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపించారు.

ఈ కేసుపై సిబిఐ విచారణ జరిపించాలనే మా డిమాండ్ ను పట్టించుకోవడం లేదని అన్నారు.ప్రభుత్వం జరిపించే విచారణ మీద నాకు నమ్మకం లేదని అన్నారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు.వైసిపి పాలకులకు దళితుల ప్రాణాలంటే ఎంతో లోకువాగా ఉందని అన్నారు.సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులకు చాంద్రబాబు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయడంతో పాటు, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.సిబిఐ విచారణ జరిపించేలా తన వంతు ఒత్తిడి తీసుకొస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version