ప్రగతి ఆంటీ తో చిందులేసిన ఈ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలలో పలు క్యారెక్టర్లలో నటించి ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకుంది. ఈమె ఎటువంటి పాత్రలోనైనా సరే లీనమై నటిస్తూ ఉంటుంది. అందుచేతనే ఈమెను ఎక్కువ సినిమాలలో తీసుకుంటూ ఉంటారు డైరెక్టర్లు సైతం. ఇక అంతే కాకుండా ప్రగతి ఆంటీ ఖాళీ సమయాలలో ఎక్కువగా జిమ్ లో వర్కౌట్లు చేస్తూ ఉంటుంది. ఇక అందుకు సంబంధించి కొన్ని వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది ఈమె. తాజాగా ప్రగతి ఆంటీ వేసిన ఒక డాన్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారుతుంది. వాటి గురించి పూర్తి వివరాలు చూద్దాం.

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటులు పాపులర్ కావడానికి ముఖ్య కారణం సోషల్ మీడియా అని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో తమకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తూ ఎప్పుడూ కూడా అభిమానులకు దగ్గర్లోనే ఉంటారు. ప్రగతి ఆంటీ తన ఇన్స్టాగ్రామ్ నుండి బాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన ఒక సాంగ్ కు స్టెప్పులు వేయడం జరిగింది. అయితే ఈమెతో పాటు మరొక అమ్మాయి కూడా స్టెప్పులు వేయడం జరిగింది. ఇక ప్రగతి ఆంటీ తో పాటు ఆమె కూడా పోటాపోటీగా స్టెప్పులు వేయడంతో ఈమెను చూసి ప్రగతి ఆంటీ కుమార్తె అని అందరూ అనుకున్నారు.

దీంతో ప్రగతి ఆంటీ బాగా డాన్స్ వేస్తోంది అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే ప్రగతి ఆంటీ తో డాన్స్ వేసిన ఈ అమ్మాయి ఆమె కుమార్తె మాత్రం కాదట. ఆ అమ్మాయి పేరు స్నేహ మురళి. ఈమె తమిళ అమ్మాయి కావడం విశేషం. తమిళ ఇండస్ట్రీలో కూడా బాగా పాపులర్ అయిన నటి జయ మురళి కుమార్తె ఈ స్నేహా మురళి. ఈమె కూడా ఒక నటి కావడం చేత ప్రగతి ఆంటీ తో కలిసి స్టెప్పులు వేయడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతూనే ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version