సినిమాల్లోకి రాకముందు మన యాక్టర్స్ ఏం చేసేవారో తెలుసా..?

-

సాధారణంగా కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెడితే.. మరికొంతమంది విద్యాభ్యాసం పూర్తి చేసి ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా వాటిని వదిలేసి ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా సినిమాల్లోకి రాకముందు మన నటీనటులు ఏ పని చేసేవారో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

గోపీచంద్:

విలన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన గోపీచంద్ ఇండస్ట్రీలోకి రాకముందు విదేశాలలో ఉద్యోగం చేసేవారు. ఆ తర్వాత ఇండియాకి వచ్చి ఈ టీవీ చానల్లో న్యూస్ రీడర్ గా కూడా పనిచేశారు. ఇక తర్వాత ఇండస్ట్రీలో అవకాశాలు రావడంతో విలన్ గా తనను తాను ప్రూవ్ చేసుకొని.. హీరోగా ప్రస్తుతం నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు.

నాని:

నాచురల్ స్టార్ నాని ఇండస్ట్రీలోకి ఎవరి సహాయం లేకుండా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇండస్ట్రీలో హీరోగా మారకముందు శ్రీనువైట్ల అలాగే బాపు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు.

రాహుల్ రవీంద్రన్:
అసిస్టెంట్ బ్రాండ్ మేనేజర్ గా లీడింగ్ మీడియా కంపెనీలో పనిచేశారు. ఆ తర్వాత హీరోగా తన కెరీర్ ని మార్చుకున్నారు.

రజనీకాంత్:

దక్షిణాది సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రజినీకాంత్ ఇండస్ట్రీలోకి రాకముందు బస్ కండక్టర్గా పనిచేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక అక్కడి నుంచే తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు ప్రస్తుతం దేశం గర్వించదగ్గ నటుడిగా చలామణి అవుతున్నారు.

మోహన్ బాబు:
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇండస్ట్రీలోకి రాకముందు డ్రిల్ మాస్టర్ గా పనిచేశారు. అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ (PET master)గా పనిచేసేవారు. ఆ తర్వాత దాసరి సహాయంతో ఇండస్ట్రీలోకి వచ్చి కలెక్షన్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆది:
సినిమాల్లోకి రాకముందు మంచి క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకవేళ ఆయన సినిమాల్లోకి రాకపోయి ఉండి ఉంటే తప్పకుండా ఇండియా తరపున క్రికెట్ ఆడే వారేమో..

సుధీర్ బాబు:

మహేష్ బాబు బావ సుదీర్ బాబు కూడా ఇండస్ట్రీలోకి రాకముందు మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్.

భరత్ రెడ్డి:
భరత్ రెడ్డి ఇండస్ట్రీ లోకి రాకముందు అపోలో హాస్పిటల్స్ లో జూనియర్ కార్డియాలజిస్ట్ గా పని చేసేవారు.

కిషోర్:
కన్నడ లిటరేచర్ లెక్చరర్ గా పనిచేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version