మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించుకొని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు. ఈ ఏడాది జూన్ 9వ తేదీన అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. దాదాపుగా ఐదేళ్లపాటు రహస్యంగా ప్రేమించుకున్న ఈ జంట. ఎప్పుడెప్పుడు ఏడడుగులు వేస్తారో అనే విషయంపై అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఏడాది పెళ్లి జరగవచ్చు లేదా అనే విషయంపై వరుణ్ తేజ్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
తాజాగా వరుణ్ తేజ్ నటించిన గాండీవధారీ అర్జున సినిమా ప్రమోషన్స్ లో ఉన్న వరుణ్ తేజ్ ను పెళ్లి గురించి ప్రశ్నించగా ఈ ఏడాది పెళ్లి ఉంటుందని తెలియజేశారు.. అయితే పెళ్లి డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదని.. ఈ విషయంపై నిర్ణయం తమ తల్లిదండ్రులదే అంటూ తెలియజేశారు వరుణ్ తేజ్.. ముఖ్యంగా పెళ్లి తేది విషయంలో తన తల్లి పద్మజ దే తుది నిర్ణయం అని వరుణ్ తేజ్ తెలియజేయడం జరిగింది. అలాగే పెళ్లి కూడా చాలా సింపుల్ గానే చేసుకోబోతున్నట్లు తెలియజేశారు.
లావణ్య, వరుణ్ తేజ్ లవ్ విషయంలో ఎవరు ముందుగా ప్రపోజ్ చేశారని విషయాన్ని తెలియజేస్తూ తానే ముందుగా ప్రపోజల్ పెట్టినట్టుగా కూడా తెలియజేశారు.. అందుకు లావణ్య కూడా ఓకే అనడంతో ఆ తరువాత ఇరువురి కుటుంబ సభ్యులు తెలియజేయడం వల్ల వారు కూడా ఓకే చేయడంతో దానిని ఎంగేజ్మెంట్ వరకు తీసుకువెళ్లామని తెలిపారు. తన పెళ్లి ఉండబోతుందని హింట్ ను కూడా ఇచ్చారు వరుణ్ తేజ్. ప్రస్తుతం పలు రకాల సినిమాలతో బిజీగా ఉన్న వరుణ్ తేజ్ ఏడాది ఒక ఇంటి వాడు కాబోతున్నాడు.. లావణ్య త్రిపాఠి కూడా పెద్దగా సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపించలేదని వార్తలు వినిపిస్తున్నాయి.