శుక్రవారం రోజునే సినిమాల విడుదల ఎందుకో తెలుసా.. అలా రిలీజైన తొలి చిత్రమిదే..

-

జనరల్‌గా ప్రతీ శుక్రవారం థియేటర్ లో ఏదో ఒక్క కొత్త సినిమా విడుదలవుతుంటుంది. సినీ ప్రియులు ఫ్రైడే రివ్యూ లు ఇచ్చేస్తుంటారు కూడా. అలా ప్రతీ శుక్రవారం సినిమా విడుదలవుతుందన్న సంగతి అందరికీ తెలుసు. కానీ, శుక్రవారం రోజునే సినిమా ఎందుకు విడుదలవుతుంది? వేరే రోజున ఎందుకు విడుదల కాదు అన్న సంగతి చాలా మందికి తెలిసి ఉండబోదు. అందుకు గల కారణమేంటి? అలా శుక్రవారం రోజున విడుదలైన తొలి పిక్చర్ ఏదో తెలుసుకుందాం.

ప్రతీ శుక్రవారం హ్యాపీగా టాకీసుల వద్దకు వెళ్లి యువతీ యువకులు చక్కగా చిత్రాలను వీక్షిస్తుంటారు. ఆ తర్వాత సినిమా ఎలా ఎంటర్ టైన్ చేసిందో చర్చించుకుంటుంటారు. కాగా, అసలు ఫ్రైడే రోజునే మూవీ రిలీజ్ చేయడానికి గల కారణమేంటో తెలుసుకుందాం. వేతన జీవులు వారంలో ఆరు రోజులు అనగా సోమ వారం నుంచి శని వారం వరకు పని చేస్తుంటారు. అయితే, కొందరు శుక్రవారం వరకు మాత్రమే పని చేస్తుంటారు.

ఈ క్రమంలోనే కొందరు శని వారం సెలవు పెట్టుకుని ఆదివారంతో కలుపుకుని రెండు రోజులు సెలవు తీసుకుంటుంటారు. అలా రెండ్రోజుల పాటు హాయిగా గడపాలని అనుకుంటారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సినిమా విడుదల చేయడం ద్వారా ఆటోమేటిక్ గా శనివారం, ఆదివారం రెండ్రోజుల్లోనే జనాలు థియేటర్ వద్దకు వచ్చే అవకాశాలున్నాయని అలా సినిమాలను శుక్రవారం రోజున విడుదల చేయాలనుకున్నారట.

అలా హ్యాపీగా ప్రతీ ఒక్కరు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. శుక్రవారం రోజున సినిమాల విడుదల అనేది ఆనవాయితీగా వస్తున్నది. అయితే, కొన్ని కొన్ని సార్లు నిర్మాతలు తమ సినిమాలతో మరొక సినిమా క్లాష్ కాకుండా ఉండేందుకు వేరే వారాల్లోనూ పిక్చర్స్ రిలీజ్ చేస్తుంటారు.

1950కి ముందర ఇలా శుక్రవారం సినిమాలు విడుదల అయ్యేవి కావట. ఆ ఏడాది నుంచి ఈ ఆనవాయితీ వచ్చింది. అలా మన దేశంలో శుక్రవారం విడుదలైన తొలి చిత్రం ‘మొగల్ ఏ అజమ్’. ఇకపోతే శుక్రవారాన్ని భారతీయులు లక్ష్మీదేవితో పోలుస్తారు.అలా శుక్రవారం విడుదలైన సినిమాలు నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తాయనే నమ్మకం కూడా ఉంది. అలా మన దేశంలో సినిమాల విడుదల శుక్రవారాల్లోనే ఎక్కువ జరుగుతుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version