వాణి జయరాం మృతిపై అనుమానాలు.. శరీరంపై తీవ్ర గాయాలు, రక్తస్రావం..

-

ప్రముఖ సింగర్ వాణి జయరాం మరణ వార్త సినీ పరిశ్రమను కలిసివేసింది ఈరోజు మధ్యాహ్నం ఆమె తొలి శ్వాస విడిచినట్టు తెలుస్తోంది అయితే ఆమె మరణం వెనక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనిపై పోలీసులు రంగంలోకి దిగి అసలు విషయాన్ని బయట పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు..ప్రముఖ లెజెండరీ సింగర్ వాణి జయరాం మరణించారని వార్త సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది అయితే ఆమె అనారోగ్యం కారణంతో మృతి చెంది ఉంటారని అనుకున్న వార్తల్లో నిజం లేదని ఆమె మృతి వెనక అనుమానాలు వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తోంది..

వివరాల్లోకి వెళితే ఈ రోజు ఉదయం 11 గంటలకు వాణీ జయరామ్ ఎంతసేపటికి డోర్ తీయకపోవడంతో ఆమె పనిమనిషి చెన్నైలో ఉంటున్న ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది కాసేపటికి వచ్చిన ఆమె బంధువులు డోర్ను పగలగొట్టి చూడగా తీవ్ర గాయాలతో వాణి జయరాం పడి ఉన్నట్టు తెలుస్తోంది అంతేకాకుండా గ్లాస్ టేబుల్ పై రక్తపు మడుగుల్లో ఆమె పడుకున్నారని సమాచారం అంతేకాకుండా ఆమెకు నుదురు మొహంపై ఎవరు తీవ్రంగా కొట్టినట్టు గాయాలు ఉన్నాయని బంధువులు వచ్చే సమయానికి ఆమె స్పృహలో లేరని తెలుస్తోంది.. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరని తెలుస్తోంది అయితే బంధువులు ఆమెను హుటహుటీన ఆసుపత్రికి తీసుకెళ్లారని అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస సమాచారం.. అయితే ప్రస్తుతం ఏమే మృతిపై దర్యాప్తు జరుగుతుంది పనిమనిషి చెప్పిన వివరాల ప్రకారం అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసినట్టు తెలుస్తోంది అంతేకాకుండా ఆమె ఇంటిని ఆధీనంలోకి తీసుకొని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నట్టు కూడా సమాచారం..

Read more RELATED
Recommended to you

Exit mobile version