Extra Ordinary Man : ఓటీటీలోకి నితిన్‌ మూవీ.. ఎప్ప‌టి నుంచి స్ట్రీమింగ్ అంటే..!

-

Extra Ordinary Man : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ రెడ్డి హిట్ చూసి చాలా కాలమే అయింది. అప్పుడెప్పుడో భీష్మతో సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత నుంచి వచ్చిన సినిమాలు వచ్చినట్టే వెళ్లిపోయాయి. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన మాచర్ల నియోజకవర్గం కూడా పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఇక తాజాగా హీరో నితిన్‌… వక్కంతం వంశీ దర్శకత్వంలో శ్రీలీలతో కలిసి నటించిన సినిమా ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’.

Extra Ordinary Man OTT Release Date

అయితే.. నితిన్, శ్రీలీల జంటగా నటించిన “ఎక్స్ ట్రా-ఆర్డినరీ మ్యాన్” సినిమా త్వరలో డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఏ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుందనే దానిపై హాట్ స్టార్ సంస్థ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 8న థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version