F3 నుంచి మరో అప్‌డేట్..ఆ రోజు నుంచి సమ్మర్ సోగ్గాళ్ల సందడి షురూ..

-

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా,తమన్నా భాటియా, మెహరిన్ పిర్జాదా హీరోయిన్‌‌‌‌లుగా కలిసి నటించిన చిత్రం F3. దిల్ రాజు ప్రొడక్షన్‌లో తెరకెక్కిన ఈ పిక్చర్ కు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

ఈ చిత్రం కామెడీ ఎంటర్ టైనర్ గా 2019లో తెరకెక్కిన F2 సినిమాకు సీక్వెల్. ఈ సినిమా అప్ డేట్స్ వరుసగా ఇచ్చేస్తున్నారు మేకర్స్. సమ్మర్ లో రిలీజ్ అయ్యే బెస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ ఇదే అనేంతలా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి సాంగ్స్ రిలీజ్ చేసిన మేకర్స్..తాజాగా మరో అప్ డేట్ ఇచ్చేశారు.

ఈ చిత్ర ట్రైలర్ ను ఈ నెల 9న 10.08 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నెల 27న ఫిల్మ్ రిలీజ్ కానుంది. ఇక ఈ చిత్రంలో సర్ ప్రైజ్ ఎలిమెంట్ ప్లాన్ చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. ఈ సాంగ్ తో జనం ఊగిపోతారని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version