ప్రముఖ సీనియర్ నటి, బిజెపి నేత కుష్బూ ఇంట తీవ్రవిశ్వాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోదరుడు అబ్దుల్లా ఖాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా కుష్బూ ” ఈరోజుతో అన్నయ్య ప్రయాణం ముగిసింది. ఆయన ప్రేమ, మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ నాతో ఉంటుంది.
అన్నయ్య కోసం ప్రార్ధించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అన్నయ్య చెప్పినట్లు జీవిత ప్రయాణాన్ని దేవుడు నిర్ణయిస్తాడు. ఆయనతో ఎప్పటికీ సంతోషంగా ఉండాలని కోరుకున్నా. కానీ వీడ్కోలు చెప్పే సమయం వచ్చింది” సోదరుడి ఫోటో పెడుతూ కుష్బూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. కుష్బూకి అభూ భాకర్, అలీ అనే మరో ఇద్దరు సోదరులు ఉన్నారు.