డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ప్రముఖ బాలీవుడ్ క్వీన్ సోదరుడు..!!

-

గత కొన్ని సంవత్సరాల నుంచి టాలీవుడ్ , బాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని చిత్ర పరిశ్రమలలో కూడా డ్రగ్స్ వ్యవహారం రోజురోజుకి ఉత్కంఠభరితంగా మారుతోంది. ఇక ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోల వారసులు కూడా డ్రగ్స్ కేసులో ఇరుక్కుని జైలు పాలైన విషయం తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ సోదరుడు కూడా డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కారు. ఇక బాలీవుడ్ యాక్టర్ శక్తి కపూర్ కుమారుడు నటి శ్రద్ధా కపూర్ సోదరుడైన సిద్ధాంత్ కపూర్ ను బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఆదివారం రాత్రి బెంగళూరు లోని పార్క్ హోటల్ పబ్ లో ఏర్పాటుచేసిన పార్టీకి సిద్ధాంత్ కపూర్ ను డీజేగా ఆహ్వానించడం జరిగింది.

ఇక అక్కడ అతను డ్రగ్స్ కూడా సేవించాడు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు హోటల్ పై దాడి చేసి ఏకంగా 35 మందిని అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షలు కూడా చేశారు. అందులో ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ గా తేలింది. ఇక వారిలో శక్తి కపూర్ తనయుడు సిద్ధాంత్ కపూర్ కూడా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఇక మొత్తం డ్రగ్స్ తీసుకున్న సిద్ధాంత్ కపూర్ తో సహా మొత్తం ఆరు మందిని పోలీసులు అరెస్టు చేశారని వారందరిపై ఎన్ డి పి ఎస్ చట్టం కింద అభియోగాలు మోపారు అని ఈస్ట్ డివిజన్ జిల్లా జనరల్ ఆఫ్ పోలీసు భీమాశంకర్ ఎస్ గులేధ్ తెలిపారు. ఇక ఈ రోజు ఆరుగురిని కూడా కోర్టు ముందు హాజరు పరుస్తామని మిస్టర్ గులేద్ తెలిపారు. ఇకపోతే చాలామంది ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు డబ్బున్న వారు పిల్లలు కదా డ్రగ్స్ తీసుకున్నా కూడా త్వరగా జైలు నుంచి బయట పడతారు అంటూ రకరకాలుగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉండడం గమనార్హం. మరి ఈ విషయంపై అటు పోలీసులు, ఇటు శక్తికపూర్ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version