Poco F4 5G స్మార్ట్‌ ఫోన్..6జీబీ + 128 జీజి స్టోరేజ్‌తో అదిరిపోయే ఫీచర్స్‌..!

-

పోకో నుంచి ఎఫ్‌ సిరీస్‌లో భాగంగా.. పోకో ఎఫ్‌4 5జీ స్మార్ట్‌ ఫోన్‌ లాంచ్‌ అయింది. మన దేశంలో కూడా ఈ ఫోన్ త్వరలో లాంచ్‌ కానుంది. ఈ ఫోన్‌కు సంబంధించి కొన్ని వివరాలు ఇప్పటికే లీక్‌ అయ్యాయి. చైనాలో లాంచ్ అయిన రెడ్‌మీ కే40 గేమింగ్ ఎడిషన్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ చేశారు. రెడ్‌మీ కే40ఎస్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా పోకో ఎఫ్4 5జీ లాంచ్ అయ్యే అవకాశం ఉంది ఆ వివరాలు ఎలా ఉన్నాయో చూద్దామా..!
పోకో తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పోకో ఎఫ్4 5జీని అధికారికంగా ప్రకటించింది. అయితే అధికారికంగా ఫోన్‌ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌ను అందించనున్నట్లు ట్వీట్ చేసింది.

కెమెరా క్వాలిటీ..

ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉండనుంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 20 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.

పోకో ఎఫ్4 5జీ స్పెసిఫికేషన్లు (అంచనా)..

రెడ్‌మీ కే40ఎస్ స్మార్ట్ ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా పోకో ఎఫ్4 5జీ లాంచ్ అయితే.. ఇందులో 6.67 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది.
120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఇందులో అందించనున్నారు.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనుంది.
ఈ ఇమేజెస్‌లో స్మార్ట్ ఫోన్ గ్రీన్ కలర్‌లో చూడవచ్చు.
ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు.
పవర్ బటన్, వాల్యూమ్ రాకర్లు ఫోన్‌కు కుడివైపున ఉన్నాయి.
ఇటీవలే పోకో ఎఫ్4 జీటీ మనదేశంలో లాంచ్ అయింది.
పోకో ఫోన్లలో.. పోకో ఎఫ్‌1 ఇచ్చినంత క్రేజ్‌ మరే ఏ ఫోన్‌ ఇవ్వలేకపోయింది. 2018లో లాంచ్‌ అయిన ఈ ఫోన్‌.. అప్పట్లో గేమ్‌ ఛేంబర్‌ అనే చెప్పాలి. ఆ తర్వాత పోకో ఎన్నో ఫోన్లను లాంచ్ చేసింది.. కానీ ఏదీ ఆ స్థాయి వరకూ వెళ్లలేదు.. ఇప్పుడు ఈ ఫోన్‌ అయినా…సీన్‌ మారుస్తుందో లేదో చూడాలి.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version