పెళ్లిపై అలాంటి కామెంట్స్ చేసి ట్రోలర్స్ కి చిక్కిన ఫరియా..!

-

ప్రస్తుత కాలంలో పెళ్లి అంటే మనసుకు నచ్చిన వారిని పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత నచ్చకపోతే విడాకులు తీసుకోవడం అన్నట్టుగా చాలామంది అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా వ్యవహరిస్తున్న తీరు ఇదే. మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు మొదట ప్రేమ, డేటింగ్ అంటూ.. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ఎక్కువ కాలం కొనసాగుతున్నారా అంటే అదీ లేదు.. నచ్చకపోతే విడాకులు అంటూ వేరు పడుతున్నారు. మరి కొంతమంది ఏమో లైఫ్ లాంగ్ ఒకరితోనే జీవించడం అంటే కష్టం అంటూ కామెంట్లు చేస్తూ పలు రకాలుగా వార్తల్లో నిలుస్తూ.. మరొకవైపు నెటిజన్ల చేత ట్రోల్స్ కి గురవుతున్నారు. ఇప్పుడు అలాంటి జాబితాలోకి ఫరియా అబ్దుల్లా కూడా చేరిపోయింది.

జాతి రత్నాలు సినిమాలో చిట్టి క్యారెక్టర్ లో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె ఆ తర్వాత బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ లో చేసి ప్రేక్షకులను అలరించింది. ఇకపోతే తన హైట్ తనకు శాపంగా మారిందని చెప్పాలి. సాధారణ హీరోల పక్కన నటించడానికి ఈమె హైట్ అడ్డు వస్తోందని అందుకే ఈమెకు అవకాశాలు కూడా ఇవ్వడం లేదు దర్శకనిర్మాతలు. ఇదిలా ఉండగా తాజాగా పెళ్లి గురించి మాట్లాడి పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.

పెళ్లి గురించి ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఒకరితోనే ఉండాలి. అలా లైఫ్ లాంగ్ ఒకరంటే నాకు ఇష్టం ఉండదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఫరియా చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారడంతో వింత వింత కామెంట్లు చేస్తూ హోరెత్తిస్తున్నారు నెటిజన్స్. మరి కొంతమంది ట్రోలర్స్ వల్గర్ గా కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version