BJP MP సోయం బాపురావుపై కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. లంబాడాలను..ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని.. నాలుగు రోజుల కిందట సోయం బాపురావు అన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ విషయంపై కిషన్ రెడ్డి స్పందించారు. సోయం బాపు రావు చేసిన వ్యాఖ్యలు..ఆయన వ్యక్తిగతం అంటూ కామెంట్స్ చేశారు.
ఆయన ఎందుకు అలా మాట్లాడారో వారి వివరణ తీసుకుంటామని స్పష్టం చేశారు. లంబాడా సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం.. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు… వారి రిజర్వేషన్ లకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు కిషన్ రెడ్డి. గిరిజన రిజర్వేషన్ లను పెంచాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది…మత పరమైన రిజర్వేషన్ లతో కలిపి ఎస్టీ రిజర్వేషన్ లని పంపించారని వివరించారు.
ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజనులు పట్ల చిత్త శుద్ది లేదని మండిపడ్డారు. కాంగ్రెస్, brs, mim ఒకే తాను ముక్కలు అని ఫైర్ అయ్యారు. గతంలో పొత్తు పెట్టుకున్నాయి… కలిసి పని చేశాయని వివరించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థికి బీఆర్‌ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చింది… స్వాగతాలు పలికి ఊరేగింపులు చేశారని ఫైర్ అయ్యారు.