DishaPatani : ప్రముఖ హాట్ బ్యూటీ దిశా పటాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ మధ్యకాలంలో జబర్దస్త్ గా అందాలను ప్రదర్శిస్తూ నేటిజెన్లలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతుంది. బీ టౌన్ బ్యూటిఫుల్ హీరోయిన్ దిశా పటానీ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్న సంగతి అందరికీ విదితమే. అయితే.. అలాంటి బ్యూటీ దిశా కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తండ్రి..కేటుగాళ్ల చేతిలో మోసపోయాడు. దిశా పటానీ తండ్రి జగదీశ్ సింగ్ పటానీకి రూ.25 లక్షలకు కుట్టుటోపి పెట్టారు మోసగాళ్లు. యూపీ ప్రభుత్వంలో ఉన్నత పదవి ఇస్తామని నమ్మించి నగదు తీసుకున్నారట కేటుగాళ్లు. డీఎస్పీగా పనిచేసి రిటైర్ అయిన జగదీశ్ సింగ్ పటానీ… రూ.25 లక్షలు ఇచ్చి మోసపోయారట. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.