అంతర్జాతీయ ప్రమాణాలతో కాచిగూడ,చర్లపల్లి రైల్వేస్టేషన్ల మోడిఫికేషన్ : కిషన్ రెడ్డి

-

దేశవ్యాప్తంగా ఉన్న రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. వివిధ దశల్లో అందుకు సంబంధించిన పనులు జరగనున్నాయి.ఇప్పటికే కొన్నిస్టేషన్ల ఆధునీకరణకు సంబంధించి పనులు ప్రారంభం కాగా..హైదరాబాద్‌లో చర్లపల్లి,కాచిగూడ రైల్వేస్టేషన్ల డెవలప్మెంట్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే పనులు తుది దశకు చేరుకోగా.. త్వరలో ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు.

 

 

రూ.428 కోట్లతో చర్లపల్లి రైల్వే‌స్టేషన్‌లో కొత్త శాటిలైట్ టెర్మినల్, తగిన పార్కింగ్ సౌకర్యాలతో పెద్ద సర్క్యులేటింగ్ ప్రాంతం, అన్ని ప్లాట్‌ ఫారమ్‌లను కలుపుతూ 5 లిఫ్టులు, 5 ఎస్కలేటర్లు, పార్శిల్ బుకింగ్ సౌకర్యాలు, అన్ని ఆధునిక ప్రయాణికుల సౌకర్యాలను కలిగి ఉంటుందన్నారు. చర్లపల్లిలో మొత్తం 19 లైన్ల సామర్థ్యంతో 10 కొత్త లైన్లను యాడ్ చేసిన్లట్లు తెలిపారు.అటు హైదరాబాద్, సికింద్రాబాద్ స్టేషన్లలో రద్దీని తగ్గించడానికి కాచిగూడ స్టేషన్ సామర్ధ్యాన్ని పెంచామన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news