కేబీఆర్ పార్క్ వద్ద జాగింగ్ చేస్తున్న మహిళపై లైంగిక వేధింపులకు దిగాడు ఓ వ్యక్తి. ఈ సంఘటనలో మహిళ సినీ నిర్మాతకు చేదు అనుభవం ఎదురైంది. ఈ సినీ నిర్మాతను ఓ వ్యక్తి కారు నడుపుతూ వేధించాడు. ఆ వ్యక్తి అశ్లీల హావభావాలతో ప్రవర్తించాడు. తన ఫోన్ తో వీడియోలు తీస్తూ ఆమె ఎదురుగా వచ్చి ఇబ్బందికరంగా ప్రవర్తించాడు వ్యక్తి.
32 ఏళ్ళ సదరు సినీ నిర్మాత వేధింపులు తట్టుకోలేక… బంజార హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మహిళ నిర్మాత ఫిర్యాదుపై ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్లు 354 A లైంగిక వేధింపులు, 354 D వెంబడించడం 509 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక నిందితుడు నల్లటి వెర్నా కారులో వచ్చినట్టు ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితున్ని కూడా పట్టుకున్నారని సమాచారం.