సినిమా ప్రియులకు బిగ్ షాక్ తగిలింది. జూన్ 1వ తేదీ నుంచి సినిమా షూటింగ్స్, థియేటర్లు బంద్ కానున్నాయి. షూటింగులు బంద్ కావడమే కాకుండా… థియేటర్ల ప్రదర్శనలు నిలిపివేస్తున్నారు. అయితే.. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదండోయ్. కేరళలో సినిమా షూటింగ్స్, థియేటర్లు బంద్ కానున్నాయి. కేరళలో సినీ ఇండస్ట్రీ సమ్మె సైరన్ మోగింది.
జూన్ ఒకటి నుంచి సమ్మె చేయనుంది మాలీవుడ్. బడ్జెట్ పెరుగుదల, సక్సెస్ రేట్ తగ్గడం, నటీనటులతో పాటు టెక్నీషియన్లు పారితోషికం పెంచడంతో నిర్మాతలపై భారం పెరుగుతోంది. వీటిని పరిష్కరించుకోవడం కోసం సమ్మె బాట పట్టిన కేరళ సినీ పరిశ్రమ… జూన్ 1వ తేదీ నుంచి సినిమా షూటింగ్స్, థియేటర్లు నిలిపేయనుంది.