ఫిల్మ్‌ఫేర్‌ ఓటీటీ అవార్డ్స్-2023.. ఉత్తమ నటి ఆలియా భట్.. ఇంకా విన్నర్స్ ఎవరంటే..?

-

ప్రజెంట్ ట్రెండ్ అంతా ఓటీటీలదే. అందుకే చాలా మంది నటులు ఓవైపు వెండితెరపై తమ సత్తా చాటుతూనే మరోవైపు డిజిటల్ మీడియాలో దూసుకెళ్తున్నారు. ఇంకోవైపు దర్శకులు కూడా తమ కథకు స్వేచ్ఛ ఉంటుందనే ఉద్దేశంతో ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఓటీటీ ప్రేక్షకులను అలరించే నటీనటులను, దర్శకులను, ప్రోత్సహించడం కోసం గతకొంతకాలంగా ఫిల్మ్​ఫేర్.. ఓటీటీ అవార్డులను అందిస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఓటీటీ ఫిల్మ్​ఫేర్ అవార్డులను ఎవరు సొంతం చేసుకున్నారో ఓ లుక్కేద్దామా..?

వెబ్‌ ఒరిజినల్‌

  • ఉత్తమ వెబ్ ఒరిజినల్ – సిర్ఫ్‌ ఏక్‌ బందా కాఫీ హై
  • ఉత్తమ దర్శకుడు – అపూర్వ సింగ్‌ ఖర్కీ (సిర్ఫ్‌ ఏక్‌ బందా కాఫీ హై)
  • ఉత్తమ నటుడు : మనోజ్‌బాజ్‌ పాయ్‌ (సిర్ఫ్‌ ఏక్‌ బందా కాఫీ హై)
  • ఉత్తమ నటి : అలియా భట్‌ (డార్లింగ్స్‌)
  • ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌) : రాజ్‌కుమార్‌ రావ్‌ (మోనికా ఓ మై డార్లింగ్‌)
  • ఉత్తమ నటి (క్రిటిక్స్‌): షర్మిలా ఠాకూర్‌ (గుల్మోహర్)
  • ఉత్తమ సహాయ నటుడు :  సూరజ్‌ శర్మ(గుల్మోహర్)
  • ఉత్తమ సహాయ నటి : అమృతా సుభాష్‌ (లస్ట్‌ స్టోరీస్‌ 2), షెఫాలీ షా (డార్లింగ్స్‌)

వెబ్‌సిరీస్‌ (డ్రామా) విభాగం:

  • ఉత్తమ దర్శకుడు : విక్రమాదిత్య మోత్వానీ (జూబ్లీ)
  • ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్‌) : రణ్‌దీప్‌ జా (కొహరా)
  • ఉత్తమ నటుడు : సువేంద్ర విక్కీ (కొహరా)
  • ఉత్తమ నటి : రాజశ్రీ దేశ్‌పాండే (ట్రైయిల్‌ బై ఫైర్‌)
  • ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌):  విజయ్‌ వర్మ (దహడ్‌)
  • ఉత్తమ నటి (క్రిటిక్స్‌): కరిష్మా తన్నా (స్కూప్‌), సోనాక్షి సిన్హా (దహడ్‌)
  • ఉత్తమ సహాయ నటుడు: బరున్‌ సోబ్తి (కొహరా)
  • ఉత్తమ సహాయ నటి : తిలోత్తమ (దిల్లీ క్రైమ్‌ సీజన్‌ 2)

వెబ్‌ సిరీస్‌ – కామెడీ

  • ఉత్తమ నటుడు : అభిషేక్‌ బెనర్జీ (ది గ్రేట్‌ వెడ్డింగ్స్‌ ఆఫ్‌ మున్నెస్)
  • ఉత్తమ నటి : మాన్వీ గాగ్రూ (టీవీఎఫ్‌ ట్రిప్లింగ్‌)
  • ఉత్తమ సహాయ నటుడు : అర్ణభ్‌ కుమార్‌ (టీవీఎఫ్‌ పిట్చర్స్‌)
  • ఉత్తమ సహాయ నటి : షెర్నాజ్ పటేల్ (టీవీఎఫ్‌ ట్రిప్లింగ్‌ సీజన్‌ 3)
  • ఉత్తమ కామెడీ సిరీస్‌ – టీవీఎఫ్‌ పిట్చర్స్‌ సీజన్‌ 2
  • ఉత్తమ నాన్‌ ఫిక్షనల్‌ ఒరిజినల్‌ – సినిమా మార్టే దమ్‌ తక్‌

 

Read more RELATED
Recommended to you

Exit mobile version