కేటీఆర్ పై ఫైర్ అయిన మధు యాష్కీ..!

-

కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయింది అని కేటీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నాడు. అయితే ఆ అసత్య ప్రచారం వల్ల హైదరాబాద్ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. కేటీఆర్ అసత్య ప్రచారం పై దేశద్రోహం కేసు పెట్టొచ్చు అన్నారు.

ఇక మిషన్ భగీరథలో భారీ స్థాయిలో అవినీతి జరిగింది దీనిపై సీఎంతో మాట్లాడి దర్యాప్తు చేయిస్తాము అని పేర్కొన్నారు. అలాగే ఎల్బి నగర్ ఎమ్మెల్యే పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన మధు యాష్కీ. ప్రజలలో సానుభూతి కొరకు ఆరోగ్యం విషయంలో ఎమ్మేల్యే సుదీర్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నాడు. ఎల్బి నగర్ లో బై ఎలెక్షన్ రావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకోవడం లేదు. ఎమ్మేల్యే ఆరోగ్యం మంచిగా ఉండాలి అని నా మనస్పూర్తిగా కోరుకుంటున్న. సుదీర్ రెడ్డి ఆరోగ్యం పై ఎమ్మెల్యే పదవి పై ఆశ పడిన కుటుంబ సభ్యులు,లేక అయిన పార్టీ మిత్రులు అయిన అసత్య ప్రచారం చేసి ఉండాలి. సుదీర్ రెడ్డి అనారోగ్య లో ఉన్నాడన్న ప్రచారం లో మా పార్టీ కి ఎలాంటి సంబంధం లేదు. ఎల్బి నగర్ అభివృద్ధికి పార్టీ మారుతున్న అని చెప్పి మూసి లో బురద తీసే పదివి తెచ్చుకుని నిధులు మింగావు. అవినీతి అక్రమాలు బయట పడుతాయి అని దొంగ ఓట్లతో గెలిచావు. అక్రమాస్తుల చిట్టా బయటపడుతుంది అని పార్టీ మారిని వ్యక్తి సుదీర్ రెడ్డి అని మధు యాష్కీ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version