గద్దర్ అవార్డులు… ఉత్తమ హీరోకు ఎంత ప్రైజ్ మనీ అంటే .?

-

 

తెలంగాణ హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమంలో విజేతలకు షీల్డ్ తో పాటు నగదు పురస్కారం కూడా అందజేస్తారు. ఉత్తమ నటుడు, నటిగా ఎంపికైన వారికి రూ. 5 లక్షలు అందిస్తారు. ఉత్తమ మొదటి చిత్రానికి రూ. 10 లక్షలు, రెండో సినిమాకు రూ. 7 లక్షలు, మూడో సినిమాకు రూ. 5 లక్షలు అందిస్తారు. ప్రత్యేక అవార్డులు పొందిన వారికి రూ. 10 లక్షల చొప్పున ప్రైజ్ మనీ అందిస్తారు.

Gaddar Awards, prize money
Gaddar Awards, prize money

కాగా, ఇటీవలే గద్దర్ ఫిల్మ్ అవార్డుల జాబితాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. చాలామంది హీరో హీరోయిన్లు గద్దర్ ఫిల్మ్ అవార్డులను అందుకోబోతున్నారు. ప్రముఖ స్టార్ హీరో అల్లు అర్జున్ సైతం గద్దర్ ఫిల్మ్ అవార్డును ఈరోజు సాయంత్రం అందుకోబోతున్నారు. పుష్ప-2 సినిమాకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా షీల్డ్ సొంతం చేసుకోబోతున్నాడు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సహా మరి కొంత మంది మంత్రులు హాజరు కాబోతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ నటుడు, నటికి అవార్డును అందిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news