‘గాలి నాగేశ్వరరావు’గా మంచు విష్ణు.. ఫస్ట్ లుక్ రిలీజ్

-

మంచు విష్ణుకు.. టాలీవుడ్ లో మంచి క్రేజ్ వున్న సంగతి తెలిసిందే. ఈమధ్య సినిమాలు చేయని మంచు విష్ణు తాజాగా ఓ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చాడు. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో.. అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో “గాలి నాగేశ్వరరావు” అనే సినిమా చేయబోతున్నట్లు తాజాగా తన ట్విట్టర్ వేదికగా అధికారిక ప్రకటన చేశాడు మంచు విష్ణు బాబు.

ఈ చిత్రానికి ఈ షాన్ సూర్య దర్శకత్వం వహిస్తుండగా… కథ స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా కోన వెంకట్ పని చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా చోట కె నాయుడు పనిచేస్తుండగా భాను మరియు నందు డైలాగ్స్ అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. జి.నాగేశ్వరరెడ్డి స్క్రిప్ట్ అందిస్తున్నారు. ఇలా పెద్ద పెద్ద వారు ఈ సినిమాకు పని చేస్తున్నట్లు మంచు విష్ణు తెలిపాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు చెబుతానని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ఈ మేరకు పోస్టర్ కూడా విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version