నా శ్రమను నమ్ముకున్నా.. గోల్డెన్ గ్లోబ్​ అవార్డ్స్​ వేడుకలో కీరవాణి

-

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మరో విశిష్ఠ పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అవార్డును ‘ఆర్ఆర్‌ఆర్‌’ సొంతం చేసుకుంది. ఒరిజినల్‌ సాంగ్‌ విభాగానికి గానూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ‘నాటు నాటు’  పాటకు పురస్కారం వరించింది. ఈ మేరకు బుధవారం కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ హాల్‌ వేదికగా జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో రాజమౌళి, చరణ్‌, ఎన్టీఆర్‌, కీరవాణి కుటుంబసమేతంగా పాల్గొని సందడి చేశారు.

అవార్డు తీసుకున్న అనంతరం కీరవాణి మాట్లాడుతూ.. ‘‘గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందించిన హెచ్‌ఎఫ్‌పీఏకు ధన్యవాదాలు. సంతోష సమయాన్ని నా సతీమణితో పంచుకోవడం ఆనందంగా ఉంది. నా సోదరుడు రాజమౌళికి ఈ అవార్డు దక్కాలి. పాటలో భాగస్వామ్యమైన రాహుల్‌ సిప్లిగంజ్‌ ధన్యవాదాలు. నా శ్రమను, నాకు మద్దతు ఇచ్చిన వారిని నమ్ముకున్నాను. ఈ పాట విషయంలో నా కుమారుడు కాలభైరవ అద్భుత సహకారం అందించాడు’’ అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version