కరీంనగర్ జిల్లాలో యూరియా కోసం రైతుల తిప్పలు పడుతున్నారు.తిమ్మాపూర్ మండలం నుస్తులపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సంఘంలో యూరియా కోసం రైతులు చెప్పులను క్యూ లైన్లో పెట్టి మరీ పడిగాపులు కాస్తున్నారు. పంట మధ్య దశలోకి వచ్చినా యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎర్రటి ఎండలో నిలబడలేక చెప్పులు క్యూ లైన్లలో ఉంచి వారు కాస్త నీడ పట్టున వెళ్లి కూర్చున్నారు. తీరా అధికారులు వచ్చి యూరియా బస్తాలను రైతులకు అందజేశారు అయితే,కొందరికి మాత్రమే యూరియా బస్తాలు అందడంతో.. మరికొంతమంది రైతులు చేసేదేమీ లేక నిరుత్సాహంతో వెనుదిరిగారు. యూరియా కొరత లేకుండా చూడాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించినా ఆచరణ మాత్రం శూన్యంగా ఉందని రైతులు మండిపడుతున్నారు.