ఏపీకి పవన్ కళ్యాణ్ సిఎం కావాలి – టాలీవుడ్ విలన్

-

గత కొన్ని రోజుల నుంచి జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ పొత్తులు పెట్టుకుంటాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విజయవాడలో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ కావడం దీనికి మరింత బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ విలన్ జీవీ సుధాకర్ నాయుడు వీరి పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబుతో జనసేన పొత్తు పెట్టుకోకూడదని కోరారు. పవన్ కళ్యాణ్ టిడిపి తో చేతులు కలపడం తమకి ఇష్టం లేదని, అసలు కలపడం వల్ల నష్టమేనని సుధాకర్ నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పవనన్న మీ చుట్టూ ఎవరు ఉన్నారో చూసుకోండి… ఆయన పాత్రుడి కుమారుడు చిరంజీవిని ఎలా తిట్టారో గుర్తుందా అని ప్రశ్నించారు. చింతమనేని ఏమన్నాడో మర్చిపోరా అని నిలదీశారు. దానిని మేము మర్చిపోలేం. కాపుల తరఫున మీరు సీఎం కావాలని మేము కోరుకుంటున్నాం అని తెలిపారు. చంద్రబాబు మిమ్మల్ని కలిసినప్పుడు మేము చచ్చిపోయాం అని జీవి ఓ సభలో మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version