బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. మరికొద్దిసేపట్లో రిలీజ్ ట్రైలర్ విడుదల

-

నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా అదేవిధంగా శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి కీలక పాత్రల్లో దర్శకుడు కొల్లి బాబీ (కే.ఎస్.రవీంద్ర) తెరకెక్కించిన తాజా మూవీ డాకు మహారాజ్. ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించారు. అయితే సినిమా నుంచి ఇప్పటికే ఓ ట్రైలర్ వచ్చి అలరించిన విషయం తెలిసిందే. అయితే ఏపీలో భారీగా ప్లాన్ చేసిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనూహ్యంగా రద్దు అయిన విషయం తెలిసిందే. 

బాలయ్య అభిమానులకు కిక్ ఇచ్చేవిధంగా రెండో ట్రైలర్ ని మేకర్స్ సిద్ధం చేశారు. ఈ ట్రైలర్ సాలిడ్ ఎలిమెంట్స్ బాలయ్య పవర్ పుల్ డైలాగ్స్ తో ఉండనున్నట్టు సమాచారం. రిలీజ్ ట్రైలర్ ను ఇవాళ 5.53 గంటలకు విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఇది మొదటి ట్రైలర్ ను మించేలా ఉంటుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈరోజు సాయంత్రం 4 గంటలకు యూసఫ్ గడ పోలీస్ గ్రౌండ్ లో ఈవెంట్ నిర్వహించనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version