పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా చూడ్డానికి భారీ ఎత్తున ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. తెల్లవారుజాము నుంచే థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. ఈ సినిమా విడుదలను అభిమానులు పండుగలా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉదయమే మొదటి షో చూసిన ప్రేక్షకులంతా సంతోషం వ్యక్తం చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద రాత్రి నుంచే సంబురాలు జరుపుకున్నారు. రాముడి పాత్రలో ప్రభాస్ చాలా బాగా నటించాడని, హనుమంతుడి పాత్ర చిత్రానికే హైలైట్ అని అభిమానలు తెలిపారు.
ఆదిపురుష్ సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలో ఒక సీటును హనుమాన్ కోసం కేటాయించాలని దర్శకుడు ఓమ్ రౌత్ కోరిన విషయం తెలిసిందే. సినిమా థియేటర్లలో ఆ సీటును ఖాళీగానే ఉంచుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం హనుమాన్ కోసం కేటాయించిన సీటును అలా ఖాళీగా వదిలేయకుండా ఆ సీటులో హనుమంతుని ఫోటో లేదా విగ్రహంను ఉంచుతున్నాయి. ముంబయిలోని ఓ థియేటర్లో సినిమా చూడ్డానికి వచ్చిన స్కూల్ పిల్లలు, వారి టీచర్లు.. హనుమంతుడి విగ్రహాన్ని తీసుకువచ్చారు. ఆ సీటులో హనుమాన్ విగ్రహాన్ని ఉంచి.. పూజ చేసిన అనంతరం మూవీని వీక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Arya Vidya Mandir school, Mumbai, kids watching morning show of #Adipurush starting with Bajarang Bali sthapana#JaiShriRam 🙏🙏🙏#JaiBajarangBali 🙏🙏🙏#Adipurush pic.twitter.com/rUmTUDqgUV
— #Adipurush 🇮🇳 (@rajeshnair06) June 16, 2023