HanuMan : ఓటీటీలోకి వచ్చేసిన ‘హనుమాన్‌’

-

ఈ ఏడాది జనవరిలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో పాటు అంతకుమించిన వసూళ్లు రాబట్టింది. ‘హనుమాన్‌’ మూవీ. ఈ సినిమాను థియేటర్లో చూడటం మిస్ అయినవాళ్లు, ఒకసారి చూసి మరోసారి చూడాలనుకుంటున్న వాళ్లు ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. జియో సినిమా వేదికగా నిన్న రాత్రి 8 గంటల నుంచి ఈ సినిమా హిందీ వెర్షన్‌ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.

దీనిపై పలువురు నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘అద్భుతం. ఎట్టకేలకు సినిమా చూశాం’, ‘తేజ సజ్జా యాక్టింగ్‌ బాగుంది. ఈ ఒక్క సీన్‌ చాలు ఈ ఏడాది అవార్డులన్నీ అతడికే వస్తాయని చెప్పడానికి’ అని కామెంట్స్‌ పెడుతున్నారు. తెలుగు ఆడియన్స్‌ మాత్రం కాస్త అసహనం వ్యక్తం చేస్తూ. ‘దక్షిణాది భాషల్లో ఎప్పుడు రిలీజ్‌ చేస్తారు?’, ‘ఇంకెంత కాలం ఎదురుచూడాలి..?’ అంటూ చిత్రబృందం, జీ5 ఓటీటీ సంస్థను ట్యాగ్‌ చేస్తూ ఎక్స్‌లో ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version