Hari Hara Veera Mallu Press Meet: జీవితంలో మొట్టమొదటి సారి నా సినిమా ప్రమోట్ చేస్తున్నాను అన్నారు హీరో పవన్ కళ్యాణ్. వేరే హీరోలకు వచ్చినంతగా నాకు కలెక్షన్స్ రావు అన్నారు పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు మూవీ ప్రెస్ మీట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పొలిటికల్‌గా నాకు చాలా పేరున్నా, దేశవ్యాప్తంగా నేను తెలిసినా.. సినిమా పరంగా నేను కొందరు హీరోల కంటే చాలా తక్కువ అన్నారు.

వేరే హీరోలకు వచ్చినంతగా నాకు కలెక్షన్స్ రావు.. ఎందుకంటే నా దృష్టి ఎప్పుడు సినిమాల మీద పెట్టలేదు నేను, సొసైటీ మరియు రాజకీయాల మీద పెట్టానని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నువ్వు చిరంజీవి కొడుకైన, నా కొడుకైన సరే టాలెంట్ లేకపోతే ఇక్కడ నిలబడ లేరన్నారు. రాజకీయాల్లో కులాలు, మతాలు మీద కొట్టుకుంటాము.. కానీ సిని ఇండస్ట్రీలో అలా ఉండదని వెల్లడించారు పవన్ కళ్యాణ్.