భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ ఆశాభావంతో ఉంది : ప్రధాని మోడీ

-

భారత ఆర్థిక వ్యవస్థ పై ప్రపంచం ఆశాభావంతో ఉందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఆయన ప్రసంగించారు. జనాభా పరంగా మధ్య ప్రదేశ్ 5వ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. వ్యవసాయం, ఖనిజాల పరంగా ముందు వరుసలో ఉంది. రెండు దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎన్నో మార్పులు సంభవించాయి. ఇక్కడ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం సుపరిపాలన పై దృష్టి సారించింది. 20 సంవత్సరాలకు ముందు ఇక్కడికి రావాలంటే పెట్టుబడిదారులు ఆలోచించే వారు. 

కానీ ఇప్పుడు పెట్టుబడుల పరంగా ముందు వరుసలో ఉంది. అలాగే సౌరశక్తిలో భారత్ సూపర్ పవర్ గా మారిందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఓ విభాగం కీర్తించింది. ఇతర దేశాలు మాటలతో ఆగిపోతుంటే.. భారత్ చెప్పింది చేసి చూపించిందని ఆ సంస్థనే పేర్కొంది. ఈ వ్యాఖ్యలు పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. ఈ సమ్మిట్ జరుగనుంది. దీనికి 60 దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ఆయా దేశాల దౌత్యవేత్తలు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version